గ్రూప్-1 ఆరోపణలపై విచారణ జరపాలి: కేటీఆర్

గ్రూప్-1 ఆరోపణలపై విచారణ జరపాలి: కేటీఆర్

TG: గ్రూప్‌-1 పోస్టుల విక్రయంపై రాష్ట్రంలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ పోస్టులు అమ్ముకున్నారని మంత్రులు, సీఎంఓపై విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నారని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. ఉద్యోగాల కోసం లక్షల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని కేటీఆర్ కోరారు.