మృతిచెందిన కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం

సత్యసాయి: మైలేపల్లి వద్ద సోమవారం జరిగిన బైక్ ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త గందోడి మంజునాథ్ పార్థివ దేహానికి ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పార్టీ నాయకులు నివాళులర్పించారు. మంజునాథ్ కుటుంబానికి రూ. 20 వేల ఆర్థిక సాయం అందజేశారు. పార్టీ కార్యక్రమాల్లో మంజునాథ్ చురుకుగా పాల్గొని, కుటుంబానికి విధేయుడిగా ఉన్నాడని నాయకులు గుర్తుచేశారు.