గౌడ సంఘం కమిటీ హాల్‌కు రూ.10 లక్షల మంజూరు

JN: జఫర్గడ్ మండలం ఓబులాపూర్ గ్రామ గౌడ సంఘం కమిటీ హాల్ నిర్మాణానికి ఎంపీ కడియం కావ్య రూ.10 లక్షల నిధులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా గ్రామ గౌడ కులస్తులు ఆనందం వ్యక్తం చేసి, స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని పుష్పగుచ్చం, శాలువాతో సన్మానించారు. PACS చైర్మన్ తీగల కరుణాకర్ రావు, మాజీ సర్పంచ్ గార్లపాటి నీరజ రెడ్డి తదితరులున్నారు.