ఉరిలో పాక్ పన్నాగాన్ని పారనివ్వని CISF బలగాలు
ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ కుట్రను CISF బలగాలు భగ్నం చేశాయి. సింధూర్ సమయంలో ఉరి హైడ్రోపవర్ ప్లాంట్‌పై పాక్ దాడికి ప్లాన్ చేసింది. దీనిని ముందే పసిగట్టిన బలగాలు అప్పటికే అక్కడ ఉన్న 250మందిని తరలించాయి. దీంతో భారీ నష్టం తప్పింది. ఇందుకు సంబంధించిన వార్త ఆలస్యంగా వెలుగులోకి రాగా వైరల్ అవుతోంది.