చిన్న లింగాపూర్‌లో ఉచిత వైద్య శిబిరం
SRCL: తంగళ్ళపల్లి మండలం చిన్న లింగాపూర్‌లో బుధవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు చంద్రిక రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మంచి ప్రోటీన్ ఉండే ఆహారం తీసుకోవాలని వివరించారు.