మద్దూర్ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ సమస్య

మద్దూర్ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ సమస్య

NRPT: మద్దూర్ పాత బస్టాండ్ వద్ద రోడ్డు వెడల్పు చేసినా సమస్యలు కొనసాగుతున్నాయని స్థానికులు తెలిపారు. రోడ్డు ఇరువైపులా ద్విచక్ర వాహనాలు పార్క్ చేయడంతో పెద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందన్నారు. దీంతో బాటసారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికులు మున్సిపల్ అధికారుల నో పార్కింగ్ జోన్ల ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.