నారా భువనేశ్వరి హామీ ఇచ్చారు.. ఇప్పటికి నెరవేర్చలేదు

కృష్ణా: కుమార్తె ఇంజినీరింగ్ చదువు, ఇల్లు నిర్మాణం కోసం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని విస్సన్నపేట మండలం కొండపర్వకి చెందిన ఎం.రాణి అన్నారు. వారు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు తన భర్త గుండెపోటుతో మృతిచెందాడన్నారు. ఆ సమయంలో నారా భువనేశ్వరి తమ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేశారన్నారు. ఇల్లు నిర్మాణ, కుమార్తె చదువు కోసం సహాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.