జలపాతాల సందర్శన అనుమతి లేదు

MLG: జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పర్యాటక కేంద్రాలు, జలపాతాల సందర్శన పర్యాటకుల భద్రత దృశ్య నిలిపేసినట్టు జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ శనివారం మీడియాకు తెలిపారు. జిల్లాలోని బొగత, ముత్యం ధార, కొంగాల, మామిడిలొద్ది, కృష్ణపురం జలపాతాల ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షంతో జలపాతాలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి.