సూళ్లూరుపేటలో 4 బస్సులు సీజ్
TPT: సూళ్లూరుపేట టోల్ గేట్ వద్ద రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఎమర్జెన్సీ డోర్లు లేకపోవడం వంటి కీలక భద్రతా లోపాలను గుర్తించి నిబంధనలు ఉల్లంఘించిన 4 ప్రైవేట్ బస్సులను సీజ్ చేశారు. ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని.. ఇకపై ఇలాంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.