'ఎండల తీవ్రతకు జాగ్రత్త తీసుకోవాలి'

'ఎండల తీవ్రతకు జాగ్రత్త తీసుకోవాలి'

SRD: ఎండల తీవ్రత కారణంగా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కంగ్టి మండల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగమణి అన్నారు. HIT TVతో ఆమె మాట్లాడుతూ. ఎండలో వెళ్లేటప్పుడు పురుషులు తలపై రుమాలు, స్త్రీలైతే ముసుగు ధరించాలన్నారు. ఎండలో పనిచేస్తున్న వారు గంట గంటకు కొంత విరామం తీసుకోవాలని చెప్పారు. అత్యవసరమైతేనే తప్ప ఎండలో బయటికి ఎవరు వెళ్లకూడదని సూచించారు.