హైకోర్టు జడ్జిని కలిసిన నిజామాబాద్ సీపీ
NZB: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం నగరంలోని R&B గెస్ట్ హౌస్‌లో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవి దేవిని పూల మొక్కను అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయా శాఖల జిల్లా అధికారులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కలు అందించారు. అనంతరం వారితో హైకోర్టు న్యాయమూర్తి కొద్దిసేపు భేటీ అయ్యారు.