సూర్యవంశీని ప్రశంసించిన మోదీ

బీహార్‌లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా RR యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీని మోదీ ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు అనుగుణంగా అథ్లెట్లకు మరిన్ని అవకాశాలు కల్పించాల్సి ఉందని పేర్కొన్నారు.