మందుబాబులకు భారీగా జరిమానాలు
VZM: పట్టణంలో నిర్వహించిన డ్రంక్ & డ్రైవ్ ప్రత్యేక తనిఖీల్లో పట్టుబడిన 29 మంది వాహనదారులను కోర్టులో హాజరుపరచగా, 27 మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున జరిమానా, ఇద్దరికి జైలుశిక్ష విధించినట్లు SP దామోదర్ శుక్రవారం తెలిపారు. CI సూరినాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నామన్నారు.