బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కీలక సమావేశం.. పాల్గొన్న హరీశ్ రావు
SDPT: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసంలో సోమవారం పార్టీ ఎమ్మెల్యేలు,మాజీ మంత్రి హరీశ్ రావు సమావేశమై రాజకీయ పరిణామాలపై చర్చించారు. వట్టినాగులపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడిపై వస్తున్న భూకబ్జా ఆరోపణలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ బృందం వెళ్లనుంది. అక్కడ బాధితులను పరామర్శించి, వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు.