పుంగనూరులో AISF వ్యవస్థాపక దినోత్సవం

పుంగనూరులో AISF వ్యవస్థాపక దినోత్సవం

CTR: AISF 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పుంగనూరులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర సమితి సభ్యులు ముఖ్య అతిథిగా హాజరై గోకుల్ సర్కిల్‌లో జెండా ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థుల సంక్షేమం కోసం 90 సంవత్సరాలుగా AISF ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా, ప్రభుత్వ విద్య పరిరక్షణకు అందరూ ఉద్యమించాలని ఆయన కోరారు.