ఏప్రిల్ 18న APTF ఆధ్వర్యంలో ధర్నా
PPM: APTF ఆధ్వర్యంలో ఏప్రిల్ 18న జరగనున్న జిల్లా స్థాయి ధర్నాను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి నల్లా బాలకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రావాడ అప్పలనాయుడు పిలుపునిచ్చారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు మంజూరు చేయాలన్నారు. ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ హక్కుల సాధన కోసం గళం విప్పాలని వారు కోరారు.