రైల్వే స్టేషన్ పరిసరాల్లో పోలీసుల తనిఖీలు

రైల్వే స్టేషన్ పరిసరాల్లో పోలీసుల తనిఖీలు

HNK: నేరస్థులను గుర్తించడంతో పాటు నేరాల నియంత్రణ కోసం తీసుకున్న చర్యలో భాగంగా కాజీపేట పోలీసుల ఆధ్వర్యంలో శనివారం రాత్రి రైల్వే స్టేషన్ ఆవరణలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా ఇతర రాష్ట్రాలకు చెందిన అనుమానిత యువకులను పోలీసులు విచారించడంతో పాటు వారి బ్యాగులను తనిఖీ చేసినట్లు కాజీపేట ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డి తెలిపారు.