దేవరకొండ కొత్త మూవీ సాంగ్ విడుదల
బేబీ' మూవీ ఫేమ్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న కొత్త చిత్రం 'ఎపిక్'. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి 'సంచారమే ఎంతో బాగున్నది' అంటూ సాగే వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నాయి. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ప్రేమ కథను సరికొత్తగా ఆవిష్కరిస్తున్నట్లు తెలుస్తోంది.