వాలీబాల్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
AKP: రాంబిల్లి మండలం మామిడివాడలో గుమళ్లమ్మ పండగ సందర్భంగా నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీలను ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ గురువారం ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ పోటీల్లో 20 జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. క్రీడాకారులు గెలుపు ఓటమిలను సమానంగా తీసుకోవాలని సూచించారు. విజేతలకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.