విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇంటి సామాగ్రి దగ్ధం
NRML: కడెం మండలంలోని కొత్త మైసంపేటకు చెందిన కోవా రాధాబాయికి చెందిన ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ఇంట్లో సామాగ్రి అగ్నికి ఆహుతి అయింది. శనివారం మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా ఇంట్లో మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న మంచంతో పాటు ఇంట్లోనే సామాగ్రి సైతం కాలిపోయింది. దీంతో ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.