ప్రత్యేక ఆకర్షణగా ముదిరాజ్‌ల ప్రభ
వరంగల్ జిల్లాలో ప్రతిఏటా జరిగే కొమ్మల జాతర ఈ సారి ఘనంగా జరుగుతోంది. ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణగా ప్రభలు నిలుస్తాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది కూడా కొమ్మల నరసింహ స్వామి ప్రబల ఊరేగింపు సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన వారు పోటాపోటిగా ప్రభలు ఏర్పాటు చేశారు. అయితే ఈ జాతరలో దుగ్గొండి మండలం నాచినపల్లి ముదిరాజ్ సంఘానికి చెందిన ముదిరాజ్ కుల ప్రభ ప్రత్యేక ఆకర్షంగా నిలిచింది.