VIDEO: 'రెండు నెలల నుంచి కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నాం'

VIDEO: 'రెండు నెలల నుంచి కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నాం'

ASR: అనంతగిరి మండలం మారుమూల చిన్నకోనెల గ్రామానికి సుమారు రెండు నెలల నుంచి కరెంటు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి గ్రామస్థులు కాగడాలు వెలిగించి నిరసన తెలిపారు. సుమారు రెండు నెలల క్రితం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయిందని అప్పటి నుంచి తమకు కరెంట్ లేదని తెలిపారు. అధికారులు సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు.