ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని TDP పార్టీ కార్యాలయంలో సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజల సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించి కొన్నింటిని అక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.