పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

MLG: వెంకటాపూర్ పోలీస్ స్టేషన్‌ను గురువారం జిల్లా ఎస్పీ శభరీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫిర్యాదు దారుల పట్ల మర్యాదగా ప్రవరిస్తూ, ఎఫ్‌ఐఆర్ లను నిష్పక్షపాతంగా నమోదు చేయాలని ఎస్పీ సూచించారు. వాహన తనిఖీలను ముమ్మరం చేస్తూ, గంజాయి రవాణాను అడ్డుకోవాలని ఎస్పీ తెలిపారు. సైబర్ నేరాలు ఆన్‌లైన్ బెట్టింగ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.