కనకమహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు
VSP: విశాఖలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వందలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తులు స్వయంగా అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు.