ఇసుక విక్రయాల్లో పారదర్శకత పాటించాలి: కలెక్టర్
NDL: జిల్లాలో ఇసుక తవ్వకాలు, రవాణా, విక్రయాల్లో పూర్తి పారదర్శకత పాటించాలని కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించిన ఇసుక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు ఇసుక సులభంగా, సకాలంలో అందుబాటులో ఉండేలా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా, అందరికీ సమానంగా అందేలా చూడాలన్నారు.