'సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

'సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

SRPT: గ్రామాల్లో ప్రజలు సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అనంతగిరి ఎస్సై నవీన్ కుమార్ అన్నారు. ఈరోజు మండల కేంద్రమైన రంగయ్య గూడెం గ్రామంలో పోలీసు కళాజాత బృందంతో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో సైబర్‌ క్రైమ్‌ విపరీతంగా పెరిగిందని చెప్పారు. కొత్త వ్యక్తులు ఎవరు ఫోన్‌ చేసినా వారికి వ్యక్తిగత విషయాలు చెప్పరాదని తెలిపారు.