జిల్లా ట్రెజరీ కార్యాలయంలో 7 ఉద్యోగులు సస్పెన్షన్

జిల్లా ట్రెజరీ కార్యాలయంలో 7 ఉద్యోగులు సస్పెన్షన్

శ్రీకాకుళం జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఏడుగురు ఉద్యోగులను డిప్యూటీ డైరెక్టర్ రవికుమార్ సస్పెండ్ చేశారు. సోమవారం రాత్రి ఈ వివరాలను వెల్లడిస్తూ, ఇటీవల కార్యాలయంలో జరిగిన అవకతవకలపై ఫిర్యాదులు రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సస్పెండ్ అయిన వారిలో బి. మోహనరావు, ఎం. డేవిడ్, పి. నాగభూషణరావు, ప్రదీప్ కుమార్, రాజశేఖర్, మనోహర్, సాయి కృష్ణ ఉన్నారు.