'చదువు మన తలరాతను మారుస్తుంది'
MLG: చదువు మన తలరాతను మారుస్తుందని ములుగు మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ రేగ కళ్యాణి అన్నారు. ఏటూరునాగారం పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న శ్రీజకు ఛైర్‌పర్సన్ సైకిల్, పుస్తకాలు, దుస్తులను అందజేశారు. చిన్ననాటి నుంచే కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండే ఏటూరునాగారంకు మంచి పేరు తీసుకురావాలని శ్రీజకు ఆమె సూచించారు.