'ప్రజా సొత్తు దోపిడీ చేసే అధికారం ఎవరిచ్చారు'
HYD: గుజరాత్ సీఎం అయినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రధాని నరేంద్ర మోదీ అంతా ప్రజా వంచనే ఉందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ ధర్నా చౌక్‌లో మాట్లాడుతూ.. దేవుళ్ల పేరిట ఓట్లు అడగడం తప్ప ఈ దేశానికి చేసిందేమీ లేదన్నారు. ప్రజా పాలన చేయమంటే ప్రజా సొత్తు దోపిడీ చేసే అధికారం ఎవరిచ్చారని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారన్నారు.