రేపు జాతీయ లోక్ అదాలత్

రేపు జాతీయ లోక్ అదాలత్

KMR: పెండింగ్​లో ఉన్న కేసుల సత్వర పరిష్కారం కోసం శనివారం జిల్లాలోని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా 8 లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.