కానిస్టేబుల్ సర్టిఫికెట్లు పరిశీలించిన ఎస్పీ

ప్రకాశం: జిల్లా ఒంగోలు ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఇటీవల కానిస్టేబుల్‌గా ఎంపికైన 349 మంది అభ్యర్థులకు గాను 327 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో 22 మంది అభ్యర్థులు హాజరు కాలేదని అధికారులు తెలిపారు. జిల్లా ఎస్పీ దామోదర్ పర్యవేక్షణలో ఈ సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ జరిగింది.