'నాణ్యమైన విద్యుత్తును అందజేస్తాం'

'నాణ్యమైన విద్యుత్తును అందజేస్తాం'

ప్రకాశం: కురిచేడు మండలం కల్లూరు గ్రామంలో సోమవారం 'సుపరిపాలనలో భాగంగా తొలి అడుగు' కార్యక్రమం టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోల బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ.. కల్లూరు గ్రామ ప్రాంత వాసులకు నాణ్యమైన విద్యుత్తును అందజేస్తామని హామీ ఇచ్చారు.