VIDEO: రాయన్నపేటలో మహిళా దొంగ అరెస్ట్
KMM: బోనకల్ మండలం రాయన్నపేటలో దొంగతనానికి పాల్పడిన ఓ మహిళను గ్రామస్థులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్లమని చెప్పి గ్రామాల్లో తిరుగుతూ తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి దొంగతనాలకు పాల్పడుతున్నారు. గ్రామంలో ఒక ఇంటి తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించిన ఆ మహిళ, ఇత్తడి, రాతిండి సామాన్లను దొంగిలించిందని సమాచారం.