VIDEO: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బజ్జీలు వేసిన ఎర్రబెల్లి
WGL: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ హోటల్‌లో వేడి మిర్చీలు వేస్తూ ఓటర్ల దృష్టిని ఆకర్షించారు. ఎర్రబెల్లి చమత్కారంగా మాట్లాడుతూ, 'వేడి వేడి మిర్చిలా ప్రజల్లో కాంగ్రెస్‌పై గరం ఉంది. ఈసారి తప్పకుండా గులాబీ జెండా ఎగురుతుంది' అని అన్నారు.