క్యాన్సర్‌తో 17 ఏళ్ల బాలిక మృతి
BDK: బూర్గంపాడు మండలం గాంధీనగర్‌కు చెందిన సోమోరు మనీషా(17) క్యాన్సర్‌తో పోరాడుతూ బుధవారం మృతి చెందింది. కూలీ పనులు చేసుకునే తల్లిదండ్రులు రూ.10 లక్షలు ఖర్చు చేసినా బిడ్డ ప్రాణం దక్కలేదు. ఐటీసీ కర్మాగార కాలుష్యం వల్లే తమ ప్రాంతంలో క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.