మండలంలో కురిసిన చిరుజల్లులు

NLR: బుచ్చి మండలంలో గత నెల రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే, శుక్రవారం మధ్యాహ్నం వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. దట్టమైన నల్ల మేఘాలు కమ్ముకోవడంతో వాతావరణం చల్లబడింది. కొద్ది సమయం చినుకులు పడ్డాయి. దీంతో చిరు వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.