ఆర్టీసీ బస్సును ఢీకొన్న ట్రావెల్ బస్సు

ఆర్టీసీ బస్సును ఢీకొన్న ట్రావెల్ బస్సు

SKLM: నందిగాం మండలం లట్టిగాం సమీపంలో ఇవాళ ఉదయం ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొంది. పలాస నుంచి 49 మంది ప్రయాణికులతో శ్రీకాకుళం వెళ్తున్న పల్లె వెలుగు బస్సు రిక్వెస్ట్ బస్ స్టాప్ వద్ద ఆగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడుకి గాయాలయ్యాయి. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.