కొత్త అపాచీ RTR 160 4V.. ధర ఎంతంటే?
దేశీయ మార్కెట్‌లో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS మోటారు కంపెనీ 2026 అపాచీ RTR 160 4Vని విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.1.25 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్) కంపెనీ నిర్ణయించింది. గరిష్ఠంగా రూ.1.37 లక్షల వరకు ఉంటుంది. కొత్త అపాచీ మొత్తం మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. మ్యాటీ బ్లాక్, గ్రానైట్ గ్రే, పెరల్ వైట్ రంగుల్లో లభిస్తుంది.