పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన.. అదనపు కలెక్టర్
BHPL: మల్హర్రావు మండలం తాడిచర్ల గ్రామంలో జరుగుతున్న మూడో విడత GP ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఇవాళ మధ్యాహ్నం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ఓటింగ్ సాఫీగా సాగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధితులకు సూచించారు.