బీసీ రిజర్వేషన్లపై నిరసనలకు జేఏసీ పిలుపు

బీసీ రిజర్వేషన్లపై నిరసనలకు జేఏసీ పిలుపు

NGKL: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించి అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీసీ, ఎస్సీ జేఏసీ నాయకులు ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి జిల్లా వ్యాప్తంగా బుధవారం నిరసనలు చేపట్టనున్నట్లు మంగళవారం ప్రకటించారు. అన్ని పార్టీల నాయకులు ఉద్యమానికి సహకరించాలని కోరారు.