VIDEO: 'ఆ సినిమాలు గ్లోబల్ స్థాయిలో నిలబడ్డాయి'
RR: లోకల్ ఏరియాల చుట్టూ తిరిగే కథలతో తెరకెక్కించిన 'కాంతార', 'పుష్ప' సినిమాలు గ్లోబల్ స్థాయిలో నిలబడ్డాయని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. స్థానిక ప్రాంతాలతో ముడిపడి ఉన్న కథలతో తీసిన సినిమాలే ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నాయని వెల్లడించారు. సినిమా రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తోందన్నారు.