అక్రమ ఇసుక ట్రాక్టర్ స్వాధీనం.. ఒకరిపై కేసు

అక్రమ ఇసుక ట్రాక్టర్ స్వాధీనం.. ఒకరిపై కేసు

SDPT: కోహెడ మండలంలోని నారాయణపూర్ గ్రామ శివారులో మోయ తుమ్మెద వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. రహస్య సమాచారం మేరకు కోహెడ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఇసుక లోడుతో వెళ్తున్న వాహనాన్ని గుర్తించారు. తరలిస్తున్న ఇసుకకు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో ట్రాక్టర్ను సీజ్ చేసి, గోట్లమిట్టకి చెందిన నిందితుడు బండారి రవిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.