కొల్లిపరలో ఇసుక ట్రాక్టర్ సీజ్
గుంటూరు: కొల్లిపర మండలం బొమ్మువానిపాలెం రీచ్ నుంచి తెనాలికి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను ఎస్.ఐ ఎన్. ప్రసాద్ దావులూరు అడ్డురోడ్డు వద్ద సీజ్ చేశారు. హనుమాన్‌పాలెంకు చెందిన ముప్పవరపు శైలేశ్ రెడ్డి ఇసుక తరలిస్తుండగా తనిఖీల్లో పట్టుబడింది. పోలీసులు ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించి, అక్రమ రవాణాపై కేసు నమోదు చేశారు.