తిప్పర్తి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా

తిప్పర్తి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా

NLG: కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని CITU మండల కన్వీనర్ గణేష్ డిమాండ్ చేశారు. ఇవాళ తిప్పర్తిలోని మార్కెట్ యార్డ్ నుంచి ఎమ్మార్వో ఆఫీస్ వరకు కార్మికులతో కలిసి ఆయన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.