విజయ్ దేవరకొండ స్వగ్రామంలో నేడు రిసెప్షన్
TG: నాగర్‌కర్నూల్(D) బల్మూర్(M) తుమ్మన్‌పేటలో హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన రిసెప్షన్‌ను ఇవాళ నిర్వహించనున్నారు. నూతన దంపతులు తమ గ్రామ ప్రజల ఆశీర్వాదాలు పొందేందుకు ప్రత్యేకంగా ఈ వేడుకను ఏర్పాటు చేశారు. విజయ్ దేవరకొండకు నాలుగేళ్లు ఉన్నప్పుడు తల్లిదండ్రులు గ్రామం నుంచి వెళ్లిపోయారు. గ్రామంలో 8 ఎకరాల వ్యవసాయ భూమి, పండ్లు, పూల తోట, ఇల్లు ఉంది.