రేపు ప్రత్యేక PGRS కార్యక్రమం
KDP: పోరుమామిళ్ల మండలంలోని వెలుగు కార్యాలయంలో రేపు ఉదయం 10 గంటలకు ప్రత్యేక PGRS కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బద్వేలు రెవిన్యూ డివిజనల్ అధికారి చంద్రమోహన్ ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజల తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. అన్ని ప్రభుత్వ శాఖ మండలాధికారులు తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన కోరారు.