VIDEO: 'ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలి'
గుడివాడ: మెయిన్ రోడ్లలోని గుంతలను పూడ్చకుండా 'స్వచ్ఛ గుడివాడ' పేరుతో నిధులు వృథా చేస్తున్నారని సీపీఎం పట్టణ కార్యదర్శి ఆర్.సీపీ రెడ్డి ఈరోజు విమర్శించారు. డివైడర్ల వద్ద మట్టి తొలగించి, ఫినిషింగ్ పేరుతో అనవసర ఖర్చులు చేస్తున్నారన్నారు. సరైన పార్కింగ్ లేదని, వృథా ఖర్చులు తగ్గించి, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆయన కోరారు.