మంజీరా నదిని పరిశీలించిన ఎస్పీ శ్రీనివాస రావు

మంజీరా నదిని పరిశీలించిన ఎస్పీ శ్రీనివాస రావు

MDK: భారీ వర్షాలు, సింగూరు ప్రాజెక్ట్ గేట్లను ఎత్తడం వలన మంజీరా నదిలో నీటి ప్రవాహం తీవ్రమైంది. ఈ నేపథ్యంలో జిల్లా SP శ్రీనివాస రావు మంగళవారం నదీ ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆయన కీలక సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 100 నెంబర్‌కు కాల్ చేయాలన్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ సూచనలు పాటించాలని జిల్లా పోలీసులు కోరుతున్నారు.