VIDEO: ఫొటో విధానంలో మార్పులు చేయాలి: సీపీఎం

VIDEO: ఫొటో విధానంలో మార్పులు చేయాలి: సీపీఎం

MDK: ఉపాధి కూలీలకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, ఫొటో విధానంలో మార్పులు చేయాలని CPM రాష్ట్ర కమిటీ సభ్యుడు అడివయ్య డిమాండ్ చేశారు. భూ సమస్యలు పరిష్కరించడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న రోడ్లు, మైనర్ ఇరిగేషన్ పనులకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం మార్చి 24న కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాకు హాజరు కావాలన్నారు.